Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › పడమటిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
బ్రేకింగ్ న్యూస్

పడమటిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

04:08 తెల్లవారుజాము AM

ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన సర్పంచ్ పల్ల శ్రీకాంత్ రెడ్డి

విద్యార్థుల, పాఠశాల అభివృద్ధికి సేవలందించిన ఉపాధ్యాయులకు అభినందనలు

దేవరకొండ, సెప్టెంబర్ 6, అయుష్ 24 న్యూస్:
ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని పడమటిపల్లి సర్పంచ్ పల్ల శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పడమటిపల్లి జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు చిన్నానాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సరస్వతీ దేవి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సీనియర్ ఉపాధ్యాయులు, ‘మనం మనబడి’ ఫౌండేషన్ ట్రెజరర్ నల్లమాద నారాయణరెడ్డి, పల్ల వెంకట్ రెడ్డి, ఎం. నారాయణ సింగ్‌లను ప్రధానోపాధ్యాయులు, సర్పంచ్, ఉపాధ్యాయులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పల్ల శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గురువును మించిన దైవం లేదని, ఉపాధ్యాయుల బోధన, మార్గదర్శకత్వంతోనే విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోగలరని అన్నారు. తాను ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న క్రమంలోనూ తన పాఠశాల ఉపాధ్యాయుల బోధన, మార్గదర్శకత్వం ఎంతో ఉపయోగపడిందని తెలిపారు.

ప్రజల మన్ననలు పొందడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడంలో పాఠశాల తరగతి గది తనకు ఎంతో నేర్పిందని చెప్పారు. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని పేర్కొన్నారు.

పడమటిపల్లి పాఠశాలలో ఉత్తమ బోధన అందించిన నారాయణరెడ్డి, పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి కృషి చేసిన పల్ల వెంకట్ రెడ్డి, తన సొంత ఆర్థిక సహాయంతో విద్యార్థులకు అండగా నిలిచిన ఎం. నారాయణ సింగ్ సేవలను సర్పంచ్ అభినందించారు. వారి సేవలను పాఠశాల విద్యార్థులు, గ్రామ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పుష్పాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ‘మనం మనబడి’ ఫౌండేషన్ అధ్యక్షులు వెంకట్ నరసింహ, మసన శివ తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 56🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
0 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *