Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › పద్మశాలీలు రాజకీయాల్లో రాణించాలి
బ్రేకింగ్ న్యూస్

పద్మశాలీలు రాజకీయాల్లో రాణించాలి

04:53 తెల్లవారుజాము AM

పద్మశాలి ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించిన రాష్ట్ర పద్మశాలి సంఘం

దేవరకొండ, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్:

పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారు రాజకీయాల్లో మరింతగా రాణిస్తూ సమాజ అభివృద్ధికి బాసటగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్తపు మురళి, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి అన్నారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల వివిధ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన పద్మశాలి సోదర సోదరీమణులకు శనివారం హైదరాబాద్‌లో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా దేవరకొండ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఇటీవల ఎన్నికైన పున్న శైలజ వెంకటేశ్వర్లు, వార్డు కౌన్సిలర్ పులిజాల భవాని జానీలను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పద్మశాలి సమాజం విద్య, వ్యాపారం, ఉద్యోగాలు, రాజకీయాలు తదితర రంగాల్లో ముందుకు సాగుతోందన్నారు. రాజకీయ రంగంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

అదేవిధంగా పద్మశాలి సమాజానికి సంప్రదాయంగా ఉన్న చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గత కొంతకాలంగా చేనేత సహకార సంఘాల ఎన్నికలు జరగకపోవడంతో ఆ రంగం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని వారు అభిప్రాయపడ్డారు.

చేనేత రంగం అభివృద్ధికి ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహం అందించాలని కోరారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన పద్మశాలి నాయకులు తమకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు సేవ చేయడంతో పాటు సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు, పద్మశాలి ప్రజాప్రతినిధులు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

— అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 51🔗 Shares: 3👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
0 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *