మంథనిలో 9వ తరగతి గణిత జవాబు పత్రాల బాహ్య మూల్యాంకనం
మంథని, అక్టోబర్ 03, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
పరీక్షల సంస్కరణల్లో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాల్లో 6, 9వ తరగతులకు ప్రథమ, ద్వితీయ సమ్మేటివ్ పరీక్షల జవాబు పత్రాలకు బాహ్య మూల్యాంకనం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా మంథని మండలంలోని ఏడు ఉన్నత పాఠశాలలకు చెందిన 9వ తరగతి విద్యార్థుల ప్రథమ సమ్మేటివ్ పరీక్షల గణిత జవాబు పత్రాల బాహ్య మూల్యాంకన శిబిరాన్ని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రారంభించారు.
మండల విద్యాధికారి దాసరి లక్ష్మి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్, ప్రధాన మూల్యాంకనకర్త గీట్ల భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమైంది.
మండలంలోని వివిధ పాఠశాలల నుంచి ఎంపికైన గణిత ఉపాధ్యాయులు జవాబు పత్రాల మూల్యాంకనంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ఎల్. శ్రీనివాస్, గుంజపడుగు ఉన్నత పాఠశాల నుంచి స్వామి, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఎస్. శ్రీనివాస్, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి సీహెచ్. శ్రీనివాస్, బి. విజయ్‌కుమార్ మూల్యాంకనంలో పాల్గొన్నారు.
బాహ్య మూల్యాంకనం ద్వారా పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.










Leave a Reply