పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ
AYUSH24 News ప్రతినిధి
మంథని: సెప్టెంబర్ 29
పాత్రికేయులకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంత్రి శ్రీధర్ బాబును మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు కోడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మహావాది సతీష్ కుమార్ సభ్యులతో కలిసి పాత్రికేయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు.
వారి విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు, పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మంథని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై పాత్రికేయులను అడిగి తెలుసుకున్నారు.
మంథని ప్రాంత సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని పాత్రికేయులను కోరారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న పాత్రికేయులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షుడు అక్కల నారాయణ, సభ్యులు ఎగోలపు సంతోష్ గౌడ్, మాదేశి శ్రావణ్ కుమార్, కాశీపేట శ్రీకాంత్, ఎండీ సుభాన్, మంథని లక్ష్మణ్‌తో పాటు క్లబ్ సభ్యులు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply