50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్లో ఘన సన్మానం
మంథని: సెప్టెంబర్ 27 (AYUSH24 News ప్రతినిధి)
పాత్రికేయుల సంక్షేమమే తమ ప్రధాన అజెండా అని మంథని విద్యార్థి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు కొండెల మారుతి అన్నారు. ఆయన 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం మంథనిలోని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్లో పాత్రికేయులు ఘనంగా సన్మానించారు.
ప్రజా సమస్యలపై మారుతి చూపుతున్న చొరవ, విద్యార్థులు, యువత హక్కుల కోసం చేస్తున్న కృషిని అభినందిస్తూ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మహావాది సతీష్ కుమార్ ఆయనను ‘మంథని జ్యోతి’గా కొనియాడారు.
స్థానిక విద్యార్థుల సమస్యలతో పాటు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలపై కొండెల మారుతి నిరంతరం స్పందిస్తూ ముందుండి పనిచేస్తున్నారని వక్తలు పేర్కొన్నారు. మంథని ప్రాంతంలో విద్యార్థుల హక్కుల పరిరక్షణకు, స్థానిక సమస్యలపై గళం వినిపించడంలో ఆయన సేవలు విలువైనవని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాత్రికేయులు ఎగోలపు సంతోష్ గౌడ్, కాచర్ల శంకర్, మంథని లక్ష్మణ్, రామడుగు సాయి శ్రీనివాస్, మెడగొని రాజమౌళి గౌడ్, కాశీపేట శ్రీకాంత్, మాదేశి శ్రావణ్, ఎండీ సుభాన్, రావుల రాజ్ కుమార్, కావేటి సమ్మయ్య, అమ్ము శ్రీనివాస్‌తో పాటు స్థానిక ప్రముఖులు పాల్గొని కొండెల మారుతికి శుభాకాంక్షలు తెలిపారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply