ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా సేవా కార్యక్రమం
దేవరకొండ, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్రం ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం దేవరకొండ పట్టణంలోని ఐబీ వద్ద పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ తెలంగాణ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకూరి నరసింహ మాట్లాడుతూ సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో విలువైనవని అన్నారు. ఎండ, వానను లెక్కచేయకుండా ప్రజారోగ్యం కోసం నిరంతరం పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ద్వారా సమాజంలోని ప్రతి వర్గానికి సేవ చేయాలనే సందేశాన్ని అందిస్తున్నామని తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నక్క వెంకటేష్ యాదవ్, బీజేపీ నల్లగొండ జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ జల్దా భాస్కర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ గుండాల అంజయ్య, నేతల వెంకటేష్ యాదవ్, మండల అధ్యక్షులు రాము నాయక్, చండీశ్వర్, రెడ్డి శంకర్, సముద్రాల సహదేవులు, కసుల శంకరయ్య, గంజి హరి, జూలూరు శ్రీను, ఎర్ర యాదయ్య, జయరాం, లక్ష్మణ్, వీరేష్తో పాటు ఎస్సీ మోర్చా నాయకులు, కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply