దేవరకొండ,30అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ):
దేవరకొండ మండలం కొండ భీమనపల్లి పరిధిలోని పెంచికల్పహాడ్ టీటీడబ్ల్యూఆర్ పాఠశాల గర్ల్స్ హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థులు వరుసగా ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో దేవరకొండ సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ యలమల గోపీచంద్ మాట్లాడుతూ.. పెంచికల్పహాడ్ గర్ల్స్ హాస్టల్‌లో గత రెండేళ్లుగా విద్యార్థినులు వరుసగా ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతుండడం ఆందోళనకరమన్నారు. గురువారం రాత్రి ఒక విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసుకోగా, హుటాహుటిన ఆమెను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామన్నారు. ఆ ఘటన జరిగి 12 గంటలు గడవకముందే, అదే హాస్టల్‌లో మరో విద్యార్థిని కూడా ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
హాస్టల్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడానికి అసలు కారణమేంటో తేల్చేందుకు ఒక ప్రత్యేక కమిటీని వేసి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన పాఠశాల యాజమాన్యం మరియు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, నియోజకవర్గంలోని అన్ని గురుకుల హాస్టళ్లలో విద్యార్థినులకు కౌన్సెలింగ్ మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ నగర కార్యదర్శి యలమల హేమేందర్, నగర ఉపాధ్యక్షులు గుండాల శివరామరాజు, యలమల హేమసుందర్, కిట్టు, బాబు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
పెంచికల్పహాడ్ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినుల ఆత్మహత్యా యత్నంపై సమగ్ర విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ
దేవరకొండ,30అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ): దేవరకొండ మండలం కొండ భీమనపల్లి పరిధిలోని పెంచికల్పహాడ్ టీటీడబ్ల్యూఆర్ పాఠశాల గర్ల్స్ హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థులు వరుసగా ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply