Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో పీఆర్సీ, ఫిట్‌మెంట్?
బ్రేకింగ్ న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో పీఆర్సీ, ఫిట్‌మెంట్?

11:41 ఉదయం AM

అయుష్ 24 న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్, సెప్టెంబర్ 10: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు దసరా కానుకగా పీఆర్సీ, ఫిట్‌మెంట్ ప్రకటించే అంశంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రెండో వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) నివేదికను సెప్టెంబర్ 18వ తేదీలోపు సమర్పించాలని కమిషన్ చైర్మన్ ఎన్. శివకుమార్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు బుధవారం సాయంత్రం లేఖ రాసినట్లు తెలుస్తోంది.

పీఆర్సీ అమలు, పెండింగ్‌లో ఉన్న ఆరు కరువు భత్యాల (డీఏ) విడుదల, ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన సుమారు రూ.10 వేల కోట్ల బకాయిల చెల్లింపు, సీపీఎస్ ఉపసంహరణ, నూతన వైద్య బీమా పథకాన్ని సమర్థంగా అమలు చేయడం తదితర పెండింగ్ సమస్యలపై సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.

సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే అంశంపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. పీఆర్సీ సభ్యులు, అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో ఈ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపినట్లు సమాచారం.

మరోవైపు, సెప్టెంబర్ 18న డీఏలపై ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే, సెప్టెంబర్ 19న జేఏసీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని టీజీఈజేఏసీ తెలిపింది.

ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో గురువారం తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 46🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *