మెరుగైన వైద్య సేవలతో పాటు వైద్యులు సమయపాలన పాటించాలని ఆదేశం
దేవరకొండ, సెప్టెంబర్ 30, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలను సబ్ కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, వైద్య సేవలు, పరిపాలనా పనితీరు, హాజరు, పరిశుభ్రతను సమీక్షించారు.
తనిఖీలో భాగంగా అవుట్‌పేషెంట్, ఎమర్జెన్సీ పేషెంట్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, చికిత్స నాణ్యత, పంపిణీ చేస్తున్న పౌష్టికాహారంపై రోగులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వైద్యులందరూ విధులకు హాజరయ్యే విషయంలో ఖచ్చితంగా సమయపాలన పాటించేలా చూడాలని ఆదేశించారు. ఆసుపత్రిలోని అన్ని వార్డుల్లో పారిశుధ్యం, పరిశుభ్రత ప్రమాణాలను మెరుగ్గా నిర్వహించాలని స్పష్టం చేశారు.









Leave a Reply