ఆన్లైన్ ద్వారా నియామకం ప్రకటించిన జాతీయ అధ్యక్షుడు కమల్జిత్ సింగ్
జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.బి. రాథోడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన రామావత్ సరస్వతి
దేవరకొండ, అక్టోబర్ 08, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
ప్రియాంక గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షురాలిగా మర్రిగూడ గ్రామానికి చెందిన రామావత్ సరస్వతి నియమితులైనట్లు ఆ సంఘటన జాతీయ అధ్యక్షుడు కమల్జిత్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఆన్లైన్ ద్వారా ఆమె నియామకాన్ని ప్రకటించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కమల్జిత్ సింగ్ మాట్లాడుతూ, మర్రిగూడ గ్రామానికి చెందిన రామావత్ సరస్వతి విద్యావంతురాలని, విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని పేర్కొన్నారు.
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ, ప్రియాంక గాంధీ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఆమె నాయకత్వ లక్షణాలు, సేవలను గుర్తించి నల్లగొండ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా రామావత్ సరస్వతి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలకు పూర్తి న్యాయం చేస్తానని తెలిపారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రియాంక గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.బి. రాథోడ్‌కు కృతజ్ఞతలు
తన నియామకానికి సహకరించిన సంఘటన జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.బి. రాథోడ్‌కు రామావత్ సరస్వతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తన నాయకత్వంపై నమ్మకం ఉంచి జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించేందుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంఘటన అభివృద్ధికి కృషి చేస్తానని రామావత్ సరస్వతి పేర్కొన్నారు.









Leave a Reply