ది బెస్ట్ ఏ.ఐ ఎడిటర్ అండ్ వీడియోగ్రఫీ అవార్డు అందుకున్న మంథనివాసి
భారత్ కల పుష్కర అవార్డు అందుకున్న శ్రీనివాస్
మంథని: ఫొటోగ్రఫీ రంగంలో ఫోటోగ్రఫీ తో పాటు ఏఐ ఎడిటర్ గా సేవలందిస్తున్న పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమనపల్లి కి చెందిన కోటారి శ్రీనివాస్ కు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ శంషాబాద్ లోని ఎస్ఎస్, కన్వెన్షన్ హాల్లో ఈ నెల 2,3,4 తేదీల్లో నిర్వహించిన ఫొటో ట్రేడ్ షో సందర్భంగా జరిగిన జాతీయ స్థాయి భారత్ కళా పురస్కార్ 2026 వెడ్డింగ్ ఫొటోగ్రఫీ & ఎ.ఐ ఎడిటర్ పోటీల్లో ఆయన ఉత్తమ ఏ.ఐ ఎడిటర్ & వెడ్డింగ్ ఫొటోగ్రఫీ అవార్డు ట్రేడ్ షో నిర్వాహకుల చేతిలో మీదుగా అందుకున్నారు.
భారత్ కళా పురస్కార్ 2026తో మరో గౌరవం
ప్రతిభను గుర్తించి రెండు ప్రతిష్టాత్మక పురస్కారా లకు ఎంపిక చేశారు. నిర్వాహకులు, ఫొటోగ్రాఫి పరిశ్రమకు చెందిన ప్రముఖులు మరియు సినీ నటుల చేతుల మీదుగా ఆయన అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఉత్తమ వెడ్డింగ్ వీడియోగ్రఫీ అండ్ ఏఐ ఎడిటర్ అవార్డు భారత్ కళా పురస్కార్ 2026 అందుకోవడం తనకు ఎంతో ప్రత్యేకమైన విషయమన్నారు. తన ప్రతిభను గుర్తించి పురస్కారాలతో సత్కరించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపాడు. తన ఫొటోగ్రాఫి ప్రయాణంలో ప్రోత్సాహం, సహకారం అంది స్తున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిగ్మా ఫొటోగ్రాఫీ అకాడమీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎంసి.శేఖర్, ట్రేడ్ షో నిర్వాహకులు ఎడిట్ పాయింట్ రమేష్, ఫొటోటెక్ అధినేత అభిమన్యురెడ్డి, తెలంగాణ మాజీ ఫోటోగ్రఫీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సినీ నటులు తదితరులతో పాటు దేశవ్యాప్తంగా వేలాది మంది ఫొటోగ్రాఫర్లు.పాల్గొన్నారు.










Leave a Reply