సింగపూర్ కంపెనీలకు తెలంగాణలో విస్తృత అవకాశాలు
సింగపూర్ ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందంతో మంత్రి శ్రీధర్‌బాబు సమావేశం
హైదరాబాద్ | సెప్టెంబర్ 16 | AYUSH24 NEWS ప్రతినిధి
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న **‘భారత్ ఫ్యూచర్ సిటీ’**లో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందాన్ని కోరారు.
సెమీకండక్టర్ రంగంలో సింగపూర్‌కు ఉన్న సాంకేతిక, పారిశ్రామిక అనుభవాన్ని తెలంగాణతో అనుసంధానించి రాష్ట్రంలో ఫ్యాబ్ పరిశ్రమలతో పాటు అనుబంధ పరిశ్రమలు, సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా సింగపూర్ కంపెనీల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఎనర్జీ అండ్ ట్రేడ్ శాశ్వత కార్యదర్శి ఆగస్టిన్ లీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం బుధవారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశమైంది.
ఈ సందర్భంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను పెట్టుబడులకు అనుకూలమైన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. హై వాల్యూ ఇండస్ట్రీస్, పరిశోధన–అభివృద్ధి (R&D), టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలకు అవసరమైన ఎకోసిస్టమ్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఐటీ/ఐటీఈఎస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, లైఫ్‌సైన్సెస్, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, గ్రీన్ టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్అండ్డీ, స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలకు తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలు, ప్రభుత్వ విధానాలు, అందుబాటులో ఉన్న మౌలిక వసతులపై సింగపూర్ కంపెనీలకు అవగాహన కల్పించాలని ప్రతినిధులను కోరారు.
అలాగే, డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న **‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2026’**లో సింగపూర్ ప్రభుత్వం, ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొనేలా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో టీజీఐఐసీ ఎండీ శశాంక్, సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ డా. ఫ్రాన్సిస్ చోంగ్, ఇండియా డైరెక్టరేట్ డైరెక్టర్ జీన్ యీ, సౌత్ ఏషియా ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ ఆట్రీ టూన్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply