నియామక పత్రం అందుకుని ప్రమాణ స్వీకారం
దేవరకొండ, సెప్టెంబర్ 15 (అయుష్ 24 న్యూస్):
ఉమ్మడి నల్లగొండ జిల్లా బంజారా అర్చక సంఘం అధ్యక్షుడిగా నేనావత్ కిషన్ బావోజీ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని అందుకున్న ఆయన రాష్ట్ర కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని భువనగిరి, యాదాద్రి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు సంబంధించిన బంజారా అర్చక సంఘం కార్యకలాపాలను సమన్వయం చేసే బాధ్యతలను కిషన్ బావోజీకి అప్పగించినట్లు తెలిపారు.
🗣️ సంఘం ఆశయాల కోసం పనిచేస్తా: కిషన్ బావోజీ
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నేనావత్ కిషన్ బావోజీ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బంజారా అర్చక సంఘం ఆశయాలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేస్తానని అన్నారు.

బంజారా బావోజీలు, సాధు సంతులు, మహారాజులు, సంఘం బాధ్యులు, సభ్యులను సమన్వయం చేసుకుంటూ సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అందరి సహకారంతో బంజారా అర్చక సంఘం తెలంగాణ సంస్థకు మరింత గౌరవం తీసుకువచ్చేలా పనిచేస్తానని పేర్కొన్నారు.
తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు జయరాం గురుస్వామి, ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారు సత్పతి ఎన్. వల్లి నాయకం, ఉమ్మడి నల్లగొండ జిల్లా డీడీఎన్ఎస్ బంజారా బావోజీలు, సంఘం నాయకులు, సభ్యులకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
కిషన్ బావోజీ నియామకంపై బంజారా అర్చక సంఘం నాయకులు, బావోజీలు, సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
– అయుష్ 24 న్యూస్










Leave a Reply