బాలలు తమకు ఎదురయ్యే సమస్యలను భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఎలాంటి అన్యాయం జరిగినా మౌనంగా ఉండకుండా ధైర్యంగా స్పందించాలని తెలిపారు. బాలలపై జరిగే వేధింపులు, లైంగిక నేరాల నుంచి వారిని రక్షించేందుకు పోక్సో చట్టం ప్రత్యేక రక్షణ కల్పిస్తుందని వివరించారు.
బాలల భద్రత, హక్కుల పరిరక్షణ కేవలం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. విద్యార్థులు తమ హక్కులతో పాటు భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు గీట్ల భరత్ రెడ్డి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె. రఘోత్తం రెడ్డి, న్యాయవాదులు శశిభూషణ్ కాచే, గౌతమి శ్రీలక్ష్మి, వ్యాస్ కుమార్తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బాలల హక్కులు, రక్షణపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం
27అక్టోబర్2026
04:16 తెల్లవారుజాము AM
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.

AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply