మాతృమూర్తి మృతి పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
చింతపల్లి, సెప్టెంబర్ 25 (ప్రతినిధి): బీసీ పొలిటికల్ యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి సతీష్ గౌడ్ మాతృమూర్తి కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మాతృమూర్తి మృతి పట్ల ఎమ్మెల్యే బాలు నాయక్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న మాతృమూర్తిని కోల్పోవడం ఎంతో బాధాకరమని పేర్కొన్న ఎమ్మెల్యే, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు తన సానుభూతి ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలంపల్లి నర్సింహ, లోకసాని శ్రీధర్ రెడ్డి, మారుపాకుల సురేష్ గౌడ్, హనుమంతు వెంకటేష్ గౌడ్, హనుమంతు సాయి చంద్ర గౌడ్, చింతపల్లి నర్సింహ, వంగూరి రాజు, పగిళ్ల శీను, తుమ్మల శ్రీనివాస్ రెడ్డి, ఎర్ర కృష్ణ, పగిల్ల శ్రీను, వంగూరి నారయ్య, లాలికోట చెన్నయ్య, ముత్యాలు, వంగూరి శ్రీనివాసులు, లింగం, తిరుపతయ్య, శీను, లాలయ్య, బాలు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply