వాడవాడలా ఘనంగా వినాయక చవితి వేడుకలు
దేవరకొండ, సెప్టెంబర్ 14 | AYUSH24 NEWS ప్రతినిధి:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలో వాడవాడలా ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో గణనాథునికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సోమవారం దేవరకొండ పట్టణంలోని మార్కెట్ యార్డు ఎదురుగా ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మండల నిర్వాహకులు, భక్తులు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండప నిర్వాహకులు మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుని తొలి పూజతో ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు.
వినాయక చవితి వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
AYUSH24 NEWS
నిజమైన సమాచారం • నిష్పక్షపాత వార్తలు



Musini.Anjan





Leave a Reply