పెద్దపల్లి, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన వినాయకుడికి మూడు రోజుల పాటు పోలీస్ సిబ్బంది భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గురువారం వినాయక విగ్రహాన్ని పట్టణంలోని ఎల్లమ్మ చెరువుకు తీసుకెళ్లి ఘనంగా నిమజ్జనం చేశారు.
ఈ సందర్భంగా రూరల్ ఎస్ఐలు మధుకర్, శ్వేత మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలను పోలీస్ సిబ్బంది భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నామని తెలిపారు. విఘ్నాలు తొలగించి ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వినాయకుడిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించామని, పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించడంతో పాటు పండుగ సమయంలో భక్తి భావంతో పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఎస్ఐ మధుకర్ తెలిపారు. ప్రజలు కూడా పండుగలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన కోరారు.
Tags:
#పెద్దపల్లి #పెద్దపల్లిరూరల్ #పోలీస్స్టేషన్ #వినాయకచవితి #వినాయకనిమజ్జనం #ఎల్లమ్మచెరువు #పోలీసుసిబ్బంది #భక్తిశ్రద్ధలు #AYUSH24NEWS










Leave a Reply