కుటుంబ కలహాల నేపథ్యంలో ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం
AYUSH24 News ప్రతినిధి
మంచిర్యాల: సెప్టెంబర్ 29
మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్డులో వైద్య మోహన్ (40) అనే వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆయనపై రోకలిబండతో దాడి జరిగినట్లు ప్రాథమిక సమాచారం.
దాడిలో తీవ్రంగా గాయపడిన మోహన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న మంచిర్యాల పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఈ ఘటనలో మోహన్ భార్య జమున పాత్ర ఉందనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కుటుంబ కలహాలు, భర్త వేధింపుల నేపథ్యంలో ఘటన జరిగిందా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు, ఇతర వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply