రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యదర్శిగా నియామక పత్రం అందజేత
హైదరాబాద్, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యదర్శిగా నియమితులైన అరెల్లి కిరణ్ గౌడ్ గురువారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యదర్శిగా నియామక పత్రాన్ని కిరణ్ గౌడ్ అందుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేయాలని కిరణ్ గౌడ్‌కు సూచించినట్లు తెలిపారు.

అనంతరం అరెల్లి కిరణ్ గౌడ్ మాట్లాడుతూ తాను గతంలో కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలో వివిధ బాధ్యతలు కల్పిస్తూ ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన మంత్రి శ్రీధర్ బాబుతో పాటు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
— అయుష్ 24 న్యూస్
The Voice of Truth










Leave a Reply