Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం
బ్రేకింగ్ న్యూస్

మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం

02:50 తెల్లవారుజాము AM

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా గంగాపురి 33/11 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభం

మంథని, ఆగస్టు 24 | అయుష్ 24 న్యూస్

మంథని నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరో కీలక అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంథని పట్టణంలోని గంగాపురిలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంత్రి శ్రీధర్ బాబు సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంథని పట్టణం, పరిసర ప్రాంతాల ప్రజలకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.

నూతన సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గడంతో పాటు వోల్టేజీ సమస్యలకు పరిష్కారం లభించనుందని మంత్రి పేర్కొన్నారు. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని తెలిపారు.

మంథని అభివృద్ధిలో మరో ముందడుగు

మంత్రి శ్రీధర్ బాబు చొరవతో మంథని ప్రాంతంలో విద్యుత్ మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. నూతన సబ్‌స్టేషన్ ద్వారా మంథని పట్టణం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఆపరేషన్ పర్యవేక్షక ఇంజనీర్ వి. గంగాధర్, మంథని ఆపరేషన్ డీఈ వి. ప్రభాకర్, పెద్దపల్లి యూజీసీబీ & కన్స్ట్రక్షన్ డీఈ కె. శ్రీనివాస్ రెడ్డి, కన్స్ట్రక్షన్ ఏడీఈ యం. సత్యనారాయణ, మంథని కన్స్ట్రక్షన్ ఏఈఈ బి. రాజ్, కరీంనగర్ సివిల్ ఈఈ కె. శ్రీనివాస్, పెద్దపల్లి సివిల్ ఏడీఈ ఎ. జయ భారతి, ఆపరేషన్ ఏడీఈ వి. వెంకటనారాయణ, ఆపరేషన్ ఏఈ కె. సాయి తదితరులు పాల్గొన్నారు.

— అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 3🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *