Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › తెలంగాణ › మంథనిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి
తెలంగాణ

మంథనిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి

03:53 మధ్యాహ్నం PM

బతుకమ్మ, దసరా ఏర్పాట్లకు కౌన్సిల్ ఆమోదం — ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు: చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్

మంథని, సెప్టెంబర్ 30, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

మంథని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ ఎన్. మనోహర్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీకి సంబంధించిన పలు అంశాలపై కౌన్సిల్ సభ్యులతో చర్చించి ఆమోదం తీసుకున్నారు.

బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో గ్రావెల్ పోయించడం, బతుకమ్మ నిమజ్జనం చేసే చెరువుల వద్ద లైటింగ్ ఏర్పాట్లు చేయడం, దసరా పండుగ సందర్భంగా లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం నుంచి జమ్మి చెట్టు వరకు లైటింగ్, సుందరీకరణ పనులు చేపట్టే అంశాలపై సమావేశంలో చర్చించి ఆమోదించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహాయ సహకారాలతో మంథని మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మంథని పట్టణంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్ పనులను మరో మూడు రోజుల్లో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

వచ్చే సంవత్సరం జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి పట్టణంలో అవసరమైన అభివృద్ధి పనులను పూర్తి చేసి, మంథని మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

మున్సిపల్ పరిధిలో నూతనంగా ఇళ్ల నిర్మాణం చేపట్టే ప్రజలు తప్పనిసరిగా 5 అడుగుల సెట్‌బ్యాక్ వదిలి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా, సెట్‌బ్యాక్ లేకుండా నిర్మించే కట్టడాలపై మున్సిపల్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని, అవసరమైతే వాటిని తొలగిస్తామని హెచ్చరించారు.

రాబోయే రెండు నెలల్లో మంథనిని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వోడ్నాల శ్రీనివాస్ తెలిపారు. ప్లాస్టిక్ కవర్లను వినియోగించే వ్యాపారులకు జరిమానాలు విధించడంతో పాటు, నిబంధనలను ఉల్లంఘించిన సందర్భంలో షాప్ లైసెన్స్ రద్దు చేసే చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించేందుకు ప్రజలు, వ్యాపారులు, అన్ని వర్గాల వారు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి మంథనిని పరిశుభ్రమైన, పర్యావరణహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, పాలక సభ్యులు కుర్ర లింగయ్య, నూకల కమల్, మాచిడి రాజు గౌడ్, మద్దికట్ల స్రవంతి, పోతరబోయిన శ్రీలత, జంబోజు శ్రీమతి, లైశెట్టి రజిత, మారుపాక నిహారిక, పెంటరి రాజు, వేముల లక్ష్మి, యేల్లంకి వంశీధర్ పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 25🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App