సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా శాలువా, పూలమాలతో సత్కారం
AYUSH24 News ప్రతినిధి
మంథని: సెప్టెంబర్ 29
బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంథని పట్టణంలోని బోయిన్పేట 6వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్, ఆయాను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.
మంథని పట్టణ బీజేపీ అధ్యక్షుడు సబ్బని సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శ్రీపెరంబదూర్ జావ హరి కుమారిని పట్టణ కార్యదర్శి దూడపాక రోజా, అంగన్వాడీ ఆయాను పట్టణ ప్రధాన కార్యదర్శి ఎడ్ల సాగర్ సతీమణి ఎడ్ల మౌనిక శాలువా, పూలమాలతో సత్కరించారు.
చిన్నారులకు విద్యాబోధన చేయడంతో పాటు వారి ఎదుగుదలను పర్యవేక్షించడం, పౌష్టికాహారం అందించడం, గర్భిణులకు అవసరమైన సూచనలు చేయడం, ఏఎన్ఎంలతో కలిసి ఇమ్యునైజేషన్ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం వంటి సేవలను అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్నారని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. వారి సేవలను గుర్తిస్తూ ఈ సన్మానం నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బోగోజు శ్రీనివాస్, పట్టణ మాజీ అధ్యక్షుడు బూడిద తిరుపతి, సీనియర్ నాయకులు రాపర్తి సంతోష్, నారమల్ల కృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సాగర్, సామల అశోక్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు గుడ్ల గురువేష్, పట్టణ కార్యదర్శి పార్వతి విష్ణు, రమేష్, శ్రీకాంత్తో పాటు మహిళలు, అంగన్వాడీ చిన్నారులు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply