10వ వార్డులో 110 మందికి చెస్ట్ ఎక్స్రే పరీక్షలు
మంథని, అక్టోబర్ 05, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
మంథని మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో సోమవారం నిర్వహించిన ఉచిత చెస్ట్ సర్వే క్యాంపుకు విశేష స్పందన లభించినట్లు కౌన్సిలర్లు పెంటరి రాజు, నూకల కమల్ తెలిపారు.
తమ్మిచెరువు కట్ట పిల్లల పార్క్ ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ క్యాంపును నిర్వహించారు. క్యాంపులో మొత్తం 110 మంది చెస్ట్ ఎక్స్రే పరీక్షలు చేయించుకున్నట్లు వారు పేర్కొన్నారు.
ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాబోయే రోజుల్లో మరిన్ని ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు కౌన్సిలర్లు తెలిపారు.
కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధురి, ఎంఎల్హెచ్పీలు ఆర్. శ్రావణి, జి. అనూష, హెల్త్ అసిస్టెంట్లు దామోదర్, స్వామి, హెచ్ఈఓ శ్రీనివాస్, ఏఎన్ఎంలు డి. రమ, ఆర్. సంధ్య, వి. అనురాధ, పి. రేవతి, ఏ. స్వరూప రాణి, బి. రాధ, ఏఏఎంపీహెచ్సీ గద్దలపల్లి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply