అండర్-14, అండర్-17 బాలబాలికల పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ వోడ్నాల శ్రీనివాస్
మంథని, సెప్టెంబర్ 30, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పాఠశాలల క్రీడల్లో భాగంగా మంథని ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలోని సింథటిక్ టెన్నిస్ కోర్టులో అండర్-14, అండర్-17 బాలబాలికల లాన్ టెన్నిస్ పోటీలను మంథని మున్సిపల్ చైర్పర్సన్ వోడ్నాల శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
ఈ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు అక్టోబర్ 12న హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని మంథని జోన్ సెక్రటరీ, పెద్దపల్లి జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ కనకొండ లక్ష్మణ్, ఆర్గనైజర్ కొమ్మురాజు శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా వోడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు సహాయ సహకారాలతో నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టు స్థానిక క్రీడాకారుల అభివృద్ధికి ఉపయోగపడుతోందన్నారు. క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు.
ఇక్కడి క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. రాబోయే క్రీడా కార్యక్రమాలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు అల్పాహారం అందించారు.










Leave a Reply