మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆదేశాలతో బీఆర్ఎస్ శ్రేణుల నివాళి
మంథని, అక్టోబర్ 05, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో మంథని పట్టణంలో మాజీ ఎంపీ, ప్రముఖ దళిత నేత దివంగత జి. వెంకట స్వామి జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
పట్టణంలోని జి. వెంకట స్వామి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మంథని మండల అధ్యక్షుడు ఎగోళం శంకర్ గౌడ్ మాట్లాడుతూ, జి. వెంకట స్వామి కార్మిక నాయకుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా దేశానికి విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు.










Leave a Reply