గాంధీ చౌక్‌లో మున్సిపల్ చైర్మన్ వోడ్నల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలు
మహిళలను ఆప్యాయంగా పలకరించి సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
మంథని, అక్టోబర్ 19, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
మంథని పట్టణంలోని గాంధీ చౌక్‌లో మున్సిపల్ చైర్మన్ వోడ్నల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బతుకమ్మ ఆడుతున్న మహిళలను మంత్రి ఆప్యాయంగా పలకరించి, వారందరికీ సద్దుల బతుకమ్మ, విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. గాంధీ చౌక్‌లో నిర్వహించిన వేడుకలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
మహిళలందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆకాంక్షించారు.










Leave a Reply