మంథని, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): మంథని పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా పట్టణంలోని 10వ వార్డులోని గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తదుపరి రెడ్డి సంఘం బ్యాంక్వెట్ హాల్లో ఏర్పాటు చేసిన గణనాథుడు, ఓంకారేశ్వర దేవాలయం (మహాబల యూత్), గజానన సంస్థ (మందాట), పోచమ్మవాడలోని రైతు కార్మిక గణనాథుడు, నడివీధి గజానన సమస్త, రైతు గజానన మండలి, రావుల చెరువు కట్ట వద్ద మంథని క రాజా యూత్, హిందూసేన, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడు, లక్ష్మీనారాయణ గుడి వీధిలోని త్రిశూల్ యూత్, గరుడ యూత్, రాణి రుద్రమదేవి టీం, రాజీవ్‌నగర్‌లోని గణనాథుడు, ధార్మిక్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, ముత్యాలమ్మవాడ గణనాథుడు, అంబేద్కర్‌నగర్‌లో భీమ్రావ్ యూత్, అంబేద్కర్‌నగర్ యూత్, గాంధీ చౌక్ గణేష్ ఉత్సవ సమితి, పెంజరుకట్టలోని సార్వజనిక్ గజానన మండల్, బామ్ భోలేనాథ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథులను మంత్రి శ్రీధర్‌బాబు దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు గణనాథుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మంథని నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.
అనంతరం ఆయా గణేష్ ఉత్సవ కమిటీల సభ్యులు, అర్చకులు వేదమంత్రాలతో మంత్రికి ఆశీర్వచనాలు అందించారు. కమిటీ సభ్యులు శాలువాలతో మంత్రి శ్రీధర్‌బాబును సన్మానించారు.










Leave a Reply