Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › మంథనిలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే
బ్రేకింగ్ న్యూస్

మంథనిలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే

10:30 ఉదయం AM

ప్రజలు సరైన సమాచారం అందించి సర్వేకు సహకరించాలి: గుర్రం శ్రీనివాస్ గౌడ్

మంథని, సెప్టెంబర్ 9: జాతీయ గణాంక శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS)-2026లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మంథని పట్టణంలో సర్వే నిర్వహిస్తున్నట్లు గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

ఈ సందర్భంగా మంథని ఆర్డీవో సురేష్, తహసీల్దార్ ఆరిఫోద్దిన్, ఎంపీడీవో శ్రీజ, మున్సిపల్ కమిషనర్ మనోహర్, మేనేజర్ శారదలను కలిసి సర్వేకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. సర్వే లక్ష్యాలు, ప్రాముఖ్యతను వారికి వివరించారు.

దేశంలో ఉపాధి, నిరుద్యోగం, కార్మిక శక్తి భాగస్వామ్యం, స్వయం ఉపాధి తదితర అంశాలకు సంబంధించిన విశ్వసనీయ గణాంకాలను రూపొందించేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

మొదటి దశలో ఎంపిక చేసిన కుటుంబాల సాధారణ వివరాలను నమోదు చేస్తామని, అనంతరం ఎంపికైన కుటుంబాలను మూడు నెలల పాటు ప్రతి నెలా ఒకసారి సందర్శించి మొబైల్ ట్యాబ్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తామని తెలిపారు.

సర్వేలో కుటుంబ సభ్యుల విద్యార్హతలు, విద్యాభ్యాసం, వృత్తి విద్య, ఉద్యోగం, స్వయం ఉపాధి, రోజువారీ కూలి పనులు, పని గంటలు, వేతన వివరాలు, మహిళల ఆదాయ వనరులు వంటి వివరాలను నమోదు చేస్తామని చెప్పారు.

అదేవిధంగా జొమాటో, స్విగ్గీ, రాపిడో, ఓలా, ఉబెర్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పనిచేస్తున్న గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికుల వివరాలను కూడా సేకరిస్తామని తెలిపారు.

సర్వే ద్వారా సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, గణాంకాల రూపకల్పనకు మాత్రమే వినియోగిస్తామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి సందేహాలకు తావులేకుండా సరైన సమాచారాన్ని అందించి సర్వే విజయవంతానికి సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మంథని డివైఎస్‌ఓ వెంకటేశ్వర్లు, మంథని ఎంపీఎస్‌ఓ సంధ్యారాణి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

— అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 4🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
1 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *