Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › Latest › మంథనిలో బీఆర్‌ఎస్ శ్రేణుల ర్యాలీ, ధర్నా
Latest

మంథనిలో బీఆర్‌ఎస్ శ్రేణుల ర్యాలీ, ధర్నా

11:02 ఉదయం AM

మంథని, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంథనిలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ, ధర్నా నిర్వహించారు. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పుట్ట శైలజ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మహిళా కార్యకర్తలు బతుకమ్మ ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. “కళ్యాణలక్ష్మి గోవిందా.. షాదీ ముబారక్ గోవిందా.. రూ.4,000 పింఛన్ గోవిందా.. మహిళలకు నెలకు గోవిందా” అంటూ నినాదాలు చేశారు.

అనంతరం మంథని ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.

420 హామీలను అమలు చేయాలి

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన నిధులను విడుదల చేసి అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం అందించాలని కోరారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రజల తరఫున బీఆర్‌ఎస్ పార్టీ మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుందని ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, మహిళా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 2🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *