మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ నాయకుల పిలుపు
మంథని, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
మంథని పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని, దేశ రెండో ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి 1965 భారత్–పాకిస్తాన్ యుద్ధ సమయంలో దేశానికి నాయకత్వం వహించారని పేర్కొన్నారు. “జై జవాన్–జై కిసాన్” నినాదంతో దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. ఆయన ధైర్యసాహసాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

అనంతరం మహాత్మా గాంధీ జయంతిని నిర్వహించారు. అహింసా మార్గాన్ని బలంగా విశ్వసించి, స్వాతంత్ర్య ఉద్యమంలో దేశ ప్రజలను ముందుకు నడిపించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సబ్బాని సంతోష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండపాక సత్య ప్రకాష్, జిల్లా కౌన్సిల్ మెంబర్ బోగోజు శ్రీనివాస్, అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్, బీజేపీ సీనియర్ నాయకులు రాపర్తి సంతోష్, పట్టణ ఉపాధ్యక్షులు బొల్లంపల్లి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి పార్వతి విష్ణు, పట్టణ కోశాధికారి వొడ్నాల శ్రీనివాస్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply