మంథని, సెప్టెంబర్ 17,అయుష్ 24 న్యూస్:
తెలంగాణ విమోచన దినోత్సవం, భగవాన్ విశ్వకర్మ జయంతి, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా మంథని పట్టణంలోని భగవాన్ విశ్వకర్మ మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా భగవాన్ విశ్వకర్మకు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించి మంథని పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో, సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. అలాగే భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో దేశ సేవలో కొనసాగాలని, దేశం మరింత సుసంపన్నంగా అభివృద్ధి చెందాలని ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సమాజ ప్రతినిధులు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.










Leave a Reply