మంథని, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): మంథని పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ గౌతమేశ్వరాలయ చైర్మన్‌గా గుండా రాజును నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నియామక ఉత్తర్వులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం అందజేశారు.
తనను శ్రీ గౌతమేశ్వరాలయ చైర్మన్‌గా నియమించడం పట్ల గుండా రాజు హర్షం వ్యక్తం చేశారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీనుబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా తన నియామకానికి సహకరించిన మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్‌తో పాటు మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బోయినిపేట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గుండా రాజు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ గౌతమేశ్వరాలయ అభివృద్ధికి, ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని గుండా రాజు తెలిపారు. ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతాయుతంగా పనిచేస్తానని పేర్కొన్నారు.
— AYUSH 24 NEWS
The Voice of Truth Media










Leave a Reply