Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ
Home › బ్రేకింగ్ న్యూస్ › మంథని పట్టణ అభివృద్ధి శ్రీధర్ బాబు ధ్యేయం
బ్రేకింగ్ న్యూస్

మంథని పట్టణ అభివృద్ధి శ్రీధర్ బాబు ధ్యేయం

01:28 మధ్యాహ్నం PM

రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్

మంథని, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్:

మంథని పట్టణ అభివృద్ధే మంత్రి శ్రీధర్ బాబు ధ్యేయమని మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి తెలిపారు.

గురువారం మంథని పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులను మున్సిపల్ కమిషనర్ మనోహర్‌తో కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణలో భాగంగా చేపడుతున్న పనుల వల్ల నష్టపోతున్న వారిని సంప్రదించి, వారి సమస్యలను పరిగణనలోకి తీసుకుంటూ పనులను ముందుకు తీసుకెళ్లాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించినట్లు తెలిపారు.

అభివృద్ధి పనుల్లో ఎక్కడా పక్షపాత వైఖరిని అవలంబించవద్దని మంత్రి స్పష్టంగా సూచించినట్లు వారు పేర్కొన్నారు. రోడ్డు విస్తరణ పనుల కారణంగా నష్టపోయే వారికి నిబంధనల మేరకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని తెలిపారు.

అలాగే మూల మలుపుల వద్ద, నాలుగు రోడ్లు కలిసే ప్రాంతాల్లో రహదారి విస్తరణకు తగినంత స్థలం ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లు వారు వివరించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ పెంటరి రాజుతో పాటు గ్రామస్తులు మహావాది విజయ్ కుమార్, రంగి అమర్నాథ్, జక్కం రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 39🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App