Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › మట్టి వినాయకుల భాస్కరా… కానరాని లోకాలకు ఏగితివా!
బ్రేకింగ్ న్యూస్

మట్టి వినాయకుల భాస్కరా… కానరాని లోకాలకు ఏగితివా!

04:45 తెల్లవారుజాము AM

వినాయక ప్రతిమలు అడుగుతున్నాయి… “భాస్కర్! ఎక్కడ ఉన్నావని?”

వినాయక చవితి వచ్చిందంటే మట్టి వినాయకులతో ప్రజలకు పండుగ ఆనందాన్ని పంచిన భాస్కరాచారి జ్ఞాపకాలు

దేవరకొండ, సెప్టెంబర్ 13 — అయుష్ 24 న్యూస్:

వినాయక చవితి వచ్చిందంటే చాలు… దేవరకొండలో మట్టి వినాయకుల కోసం ఎంతోమంది ఒక ఇంటి వైపు చూసేవారు. పర్యావరణ పరిరక్షణను లక్ష్యంగా చేసుకుని మట్టి వినాయకులను స్వయంగా తయారు చేసి, వాటిని ఉచితంగా ప్రజలకు అందించిన కీర్తిశేషులు చొల్లేటి భాస్కరాచారి ఈరోజు లేకపోవడం పట్టణ ప్రజలను కలచివేస్తోంది.

వృత్తిరీత్యా స్వర్ణకారుడైనప్పటికీ… మట్టి వినాయక ప్రతిమల తయారీలో భాస్కరాచారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి సమీపిస్తే ఆయన చేతుల మీదుగా రూపుదిద్దుకునే మట్టి వినాయకుల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసేవారు.

చిన్న ప్రతిమల నుంచి పెద్ద విగ్రహాల వరకు… ఎలాంటి లోపం లేకుండా, ఎంతో నైపుణ్యంతో చేతితో తయారు చేసి ఉచితంగా అందించేవారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ సేవను కొనసాగిస్తూ పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేశారు.

ఈ ఏడాది వినాయక చవితి రావడంతో భాస్కరాచారి జ్ఞాపకాలను దేవరకొండ పట్టణ ప్రజలు నెమరువేసుకుంటున్నారు.

“భాస్కర్ ఉండి ఉంటే… ఈ ఏడాది కూడా ఎన్నో మట్టి వినాయకులను తయారు చేసి ఇచ్చేవాడు. ఇప్పుడు ఆయన చూపిన మార్గాన్ని ఎవరు కొనసాగిస్తారు?” అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మట్టి వినాయకులే ఆయనకు గుర్తుగా…

నేటి రోజుల్లో చాలామంది సరదా కోసం తమ ఇళ్లలోనే మట్టి వినాయకులను తయారు చేసుకుంటున్నప్పటికీ… భాస్కరాచారి మాత్రం ప్రత్యేకంగా బంకమట్టిని తెప్పించి, పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను తయారు చేసి ప్రజలకు ఉచితంగా అందించేవారని పట్టణ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.

విగ్రహాల తయారీ కోసం ఆయన పడిన శ్రమ, సమయం, నైపుణ్యం వెనుక సమాజం పట్ల ఉన్న బాధ్యత కనిపించేదని పలువురు చెబుతున్నారు.

ఏది చేసినా… అందులో ప్రత్యేకత ఉండాల్సిందే

“దైవ నిర్ణయం లేనిది ఏదీ జరగదు. మానవ జన్మ ఎత్తినందుకు సమాజానికి ఏదో ఒకటి చేయాలి” అనే ఆలోచనతో భాస్కరాచారి జీవించేవారని ఆయనను దగ్గరగా చూసినవారు చెబుతున్నారు.

తాను చేసే ప్రతి పనిలోనూ ప్రత్యేకత ఉండేలా చూసుకునేవారు. అందులో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుల తయారీకి ప్రత్యేక స్థానం ఉండేది.

వినాయక చవితి వచ్చిందంటే పట్టణంలోని అనేకమంది ఆయన ఇంటికి చేరుకుని… ఆయన చేతుల మీదుగా తయారైన మట్టి వినాయకులను తీసుకెళ్లేవారు. గంటల తరబడి అక్కడే ఉండి, తమకు నచ్చిన ప్రతిమను తీసుకెళ్లే వారు.

అలాంటి భాస్కరాచారి ఇక లేరన్న వార్తను గుర్తుచేసుకుంటూ పలువురు కన్నీటి పర్యంతమవుతున్నారు.

“మట్టిలో మట్టినై… మళ్లీ రావాలి భాస్కర్!”

తన చేతులతో తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమలను ఏళ్ల తరబడి ప్రజలకు అందించిన భాస్కరాచారి జ్ఞాపకాలు… ఆ ప్రతిమల రూపంలోనే సజీవంగా ఉన్నాయని పట్టణ ప్రజలు అంటున్నారు.

“మట్టిలో మట్టినై… రాయిలో రాయినై… ఆకాశానికి ఎగసిపోయిన నీవు… మళ్లీ రావాలి భాస్కర్” అంటూ ఆయనను స్మరించుకుంటున్నారు.

భాస్కరాచారి తయారు చేసిన వినాయక ప్రతిమలను తీసుకెళ్లిన కుటుంబాలు… ప్రతి వినాయక చవితికీ ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నాయి.

కాలం మనిషి జననం, మరణం అన్నీ భగవంతుని నిర్ణయమే అయినప్పటికీ… మనిషి జీవించిన విధానం, సమాజానికి చేసిన సేవలు మాత్రం ఆయనను ప్రజల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలబెడతాయి.

భాస్కరాచారి భౌతికంగా దూరమైనా… ఆయన చేతులతో రూపుదిద్దుకున్న మట్టి వినాయకుల్లో, ఆయనను అభిమానించిన ప్రజల జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతారు.

— అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 526🔗 Shares: 6👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
0 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *