గాంధీ ఆదర్శాలను భావితరాలకు అందించాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
మహాత్మా గాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గాంధీ ఆదర్శాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష జ్యోతి ప్రజ్వలన చేసి, గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.










Leave a Reply