Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్
బ్రేకింగ్ న్యూస్

మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

02:55 తెల్లవారుజాము AM

మంథని, ఆగస్టు 25 | అయుష్ 24 న్యూస్

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఉపసర్పంచ్ కుటుంబ సభ్యులను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, మంథని మున్సిపల్ మాజీ చైర్మన్ పుట్ట శైలజ పరామర్శించారు.

గత నెల 25న అనారోగ్యంతో మృతి చెందిన ఇనుముల గౌరమ్మ నెల మాసికం సందర్భంగా పుట్ట మధుకర్, పుట్ట శైలజ మంగళవారం కుటుంబ సభ్యులను పరామర్శించారు. గౌరమ్మ మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. గత నెల 24న సికింద్రాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గౌరమ్మను పుట్ట మధుకర్ పరామర్శించారని, సరిగ్గా నెల రోజుల తర్వాత ఆమెను కోల్పోయిన తమ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన దంపతులు ఇంటికి రావడం తమకు ఎంతో ఆత్మీయతను కలిగించిందన్నారు.

దాదాపు 26 సంవత్సరాల తర్వాత తమ ఇంటికి వచ్చి, తల్లిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న తనను, కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజకు కుటుంబ సభ్యుల తరఫున ఇనుముల సత్యనారాయణ, హైకోర్టు న్యాయవాది, మంథని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజతో పాటు మంథని బీఆర్‌ఎస్ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

— అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 2🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *