కమాన్పూర్, అక్టోబర్ 27, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు తండ్రి వైనాల సాంబయ్య ఇటీవల మరణించడంతో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా సాంబయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైనాల రాజుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వైనాల సాంబయ్య అవయవ దానం చేసిన నేపథ్యంలో సదాశివ ఫౌండేషన్ సభ్యులు ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా సాంబయ్య కుటుంబ సభ్యులకు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజును పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
27అక్టోబర్2026
08:54 ఉదయం AM
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.

AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply