సేవా కార్యక్రమాలు నిర్వహించి జన్మదినాలు జరుపుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ పున్న శైలజా వెంకటేశ్వర్లు
దేవరకొండ అక్టోబర్ 5 ఆయుష్ 24 న్యూస్
దేవరకొండ పట్టణంలోని చైర్ పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు గార్ల కుమారుడు సుమంత్ భార్గవ్, మరో కుమారసమానుడు అయిన ముత్యాల సాయినాథ్ రెడ్డి,జన్మదినం పురస్కరించుకొని ఆదివారం దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో సుమంత్ భార్గవ్ జన్మదిన వేడుకలను పారిశుద్ధ్య కార్మికులకు కంటి పరీక్షలు నిర్వహిస్తూ జరిగిన కార్యక్రమంలో కేకు కోసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి కంటి పరీక్షలను నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తన కుమారుల జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఈ సంవత్సరం తన పెద్ద కుమారుడు సుమంత్ భార్గవ్ ముత్యాల సాయినాథ్ రెడ్డి,పారిశుద్ధ్య కార్మికులకు కంటి పరీక్షలు నిర్వహించడంతోపాటు అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. తన కుమారుడు తో పాటు సాయినాథరెడ్డి సైతం తన కుటుంబ సభ్యుడు అని అందుకే తన పుట్టినరోజు కూడా మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుల సమక్షంలో కేకు కోసి జన్మదిన వేడుకలను నిర్వహించామని అన్నారు . ఈ సందర్భంగా కమిషనర్ డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి లయన్ ఎం జె ఎఫ్ గాజుల రాజేష్ లు మాట్లాడుతూ పున్నసుమంత్ భార్గవ్, ముత్యాలసాయినాథ్ లకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చైర్పర్సన్ కుటుంబ సభ్యులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ రామదుర్గారెడ్డి ,డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, ఎం జె ఎఫ్ గాజుల రాజేష్ జోన్ చైర్మన్ గాజుల ఉషారాణి, యాదమ్మ, జోత్స్నా పార్వతి, పగిడిమర్రి రాధ, ఆప్తమాలిస్టు హరి, గాజుల సావిత్రి మురళి, నేనావత్ శ్రీకన్య సేవ్య నాయక్, హనుమంతు సాయి చంద్ర గౌడ్, పులిజాల భవానీ జానీ,ముత్యాల చంద్రకళ రవి, శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ గౌడ్,మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply