గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పౌష్టికాహారంపై అవగాహన
AYUSH24 News ప్రతినిధి
మైలంపల్లి: సెప్టెంబర్ 29
మైలంపల్లి గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ‘పోషణ పక్షం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రాంసింగ్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో పౌష్టికాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఆరోగ్యంగా ఉండేందుకు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
పోషకాహార ప్రాముఖ్యతను తెలియజేస్తూ అంగన్వాడీ టీచర్లు ప్రదర్శనలు నిర్వహించడంతో పాటు అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి, సర్పంచ్ మోహన్ లాల్, మాజీ ఉప సర్పంచ్ వెంకట్, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth









Leave a Reply