దేవరకొండ,30అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ):
డిండి మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు ఈ క్రింది సమస్యల పైన నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. టీజీటీ లందరికీ నేషనల్ ఇంక్రిమెంట్స్ అందరికీ వర్తింప చేయాలని,మోడల్ స్కూల్లను విద్యా శాఖలో విలీనం చేసి 010 పద్దు కింద జీతాలు ఇప్పించాలని అధేవిధంగా 317 జీవో కూడా అమలు చేయాలని కారుణ్య నియామకాలు కూడా చేపట్టాలని అదేవిధంగా హెచ్.బి.టి. జీతాల ను పెంచాలని ఏరియార్సు ఇవ్వవలసిందిగా వారు నిరసనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే శ్యాంసుందర్, ఎం శ్రీలత,రమా, సుశీల, పులి కోదండ రామారావు, ఎన్.ఎన్. విజయ్ కుమార్, వెంకటేశ్వర్లు, చెన్నయ్య, సోమయ్య, రవి, వి విజయ్ కుమార్, రమేష్, అశ్విని, జ్యోతి,రుంషా, శ్రీను శ్రీలత, సందీప్, ధనలక్ష్మీ,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply