చిన్నారులతో సహా ఐదుగురిపై దాడి.. ఆరు గేదెలకూ గాయాలు
క్షతగాత్రులకు మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
కుక్క సంచారంతో గ్రామస్థుల్లో భయాందోళన.. చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి
రామగిరి, అక్టోబర్ 27, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని రాజాపూర్ గ్రామంలో పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. గ్రామంలో కనిపించిన వారిపై దాడి చేయడంతో చిన్నారులతో సహా ఐదుగురు గాయపడ్డారు. అంతేకాకుండా ఆరు గేదెలపై కూడా దాడి చేయడంతో అవి గాయపడ్డాయి.
కుక్క దాడిలో గాయపడిన ఐదుగురిని మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గ్రామంలో కుక్క సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కర్రలతో గ్రామంలో గస్తీ తిరిగిన యువకులు
పరిస్థితిని గమనించిన గ్రామ యువకులు, వార్డు సభ్యులు అప్రమత్తమయ్యారు. కర్రలు పట్టుకుని గ్రామంలోని వీధుల్లో గస్తీ తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేశారు. కుక్క దాడుల నుంచి గ్రామస్థులను రక్షించేందుకు చర్యలు చేపట్టారు.
వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల విజ్ఞప్తి
గ్రామంలో కుక్క సంచారంతో చిన్నారులు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దాడులకు పాల్పడుతున్న కుక్కను పట్టుకోవాలని, గ్రామ ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.










Leave a Reply