Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › హైదరాబాద్ › రాజేశ్ గౌడ్ మృతి తీరని లోటు
హైదరాబాద్

రాజేశ్ గౌడ్ మృతి తీరని లోటు

10:10 ఉదయం AM

ఎల్‌ఐసీ మలక్‌పేట సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్. రామూ చౌహాన్ సంతాపం

హైదరాబాద్, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

శ్రీ రాజేశ్ గౌడ్ మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియా మలక్‌పేట సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్. రామూ చౌహాన్ పేర్కొన్నారు. రాజేశ్ గౌడ్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

హిమాయత్‌నగర్‌లోని సిటీ బ్రాంచ్–15లో తాను పనిచేసిన సమయంలో రాజేశ్ గౌడ్ అందించిన సహకారం, చూపిన ఆప్యాయత, ప్రేమానురాగాలు జీవితంలో ఎప్పటికీ మరువలేనివని గుర్తుచేసుకున్నారు. సేవాభావంతో ఏజెంట్ మిత్రులకు, సిబ్బందికి అనేక విధాలుగా అండగా నిలిచారని తెలిపారు. ప్రతి పనిలో నీతి, నిజాయితీ పాటిస్తూ అందరితో ఆత్మీయంగా మెలిగిన ఆయన మంచితనం హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

కేవలం రెండు, మూడు వారాల క్రితమే రాజేశ్ గౌడ్, సుమన్‌తో కలిసి మలక్‌పేట బ్రాంచ్‌కు వచ్చి తనను కలిశారని రామూ చౌహాన్ గుర్తుచేసుకున్నారు. ఆ సందర్భంగా దాదాపు అరగంట పాటు ఆత్మీయంగా ముచ్చటించుకున్నామని, రాజేశ్ గౌడ్‌ను సన్మానించి సాదరంగా వీడ్కోలు పలికినట్లు తెలిపారు. అంత ఆత్మీయంగా కలిసిన వ్యక్తి ఇంతలోనే దూరమయ్యారన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానని, ఆ చివరి కలయిక తన హృదయంలో చెరగని జ్ఞాపకంగా నిలిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజేశ్ గౌడ్ మరణం అందరికీ తీరని లోటని పేర్కొంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఎస్. రామూ చౌహాన్ తెలిపారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 87🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App