73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ టోర్నమెంట్‌కు వి. పూజ ఎంపిక
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తున్న పూజ: కోచ్ రామ్ చందర్
దేవరకొండ, అక్టోబర్ 28, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన క్రీడాకారిణి వి. పూజ 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు కోచ్ రామ్ చందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కోచ్ రామ్ చందర్ మాట్లాడుతూ, పూజ దేవరకొండలో తన శిక్షణలో నిరంతరం కష్టపడుతూ కబడ్డీ సాధన చేస్తోందని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తూ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ టోర్నమెంట్‌కు ఎంపిక కావడం అభినందనీయమని పేర్కొన్నారు.
క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తూ రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించిన పూజ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
క్రీడాకారులకు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్న **కళ్యాణ్ నాయక్**కు ఈ సందర్భంగా కోచ్ రామ్ చందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.









Leave a Reply