గుజరాత్లో అక్టోబర్ 31న జరిగే జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం
దేవరకొండ నియోజకవర్గం నుంచి కొర్ర రాంసింగ్ నాయక్‌కు అవకాశం
నల్గొండ జిల్లా నుంచి మొత్తం 15 మంది పాల్గొననున్నట్లు జిల్లా స్పోర్ట్స్ అధికారి ఎండీ అక్బర్ అలీ వెల్లడి
దేవరకొండ, అక్టోబర్ 29, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
గుజరాత్ రాష్ట్రంలోని ఏక్తా నగర్లో అక్టోబర్ 31న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్–2026 వేడుకలకు దేవరకొండ మండలం మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎంపికయ్యారు.
‘ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్’ లక్ష్యంతో నిర్వహించనున్న ఈ జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.
దేవరకొండ నియోజకవర్గం నుంచి ప్రత్యేక ఎంపిక
దేవరకొండ నియోజకవర్గం నుంచి మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎంపికైనట్లు నోడల్ అధికారి, జిల్లా స్పోర్ట్స్ అధికారి ఎండీ అక్బర్ అలీ వెల్లడించారు.
ఈ వేడుకలకు నల్గొండ జిల్లా నుంచి మొత్తం 15 మంది వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.
ప్రముఖుల అభినందనలు
రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎంపికైన కొర్ర రాంసింగ్ నాయక్‌ను మంత్రి వెంకట్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అభినందించారు.
జాతీయ స్థాయిలో నిర్వహించే ఐక్యతా దినోత్సవ వేడుకలకు దేవరకొండ నియోజకవర్గం నుంచి కొర్ర రాంసింగ్ నాయక్‌కు అవకాశం లభించడం విశేషంగా నిలిచింది.









