అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20 తేదీలకు సంబంధించిన టికెట్లు అందుబాటులోకి
బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్న టీటీడీ
తిరుపతి, అక్టోబర్ 06, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఈ నెల 12, 13, 14, 18, 19, 20 తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.
అక్టోబర్ 11 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుమలలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం సులభతరం చేసేందుకు టీటీడీ పలు ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.










Leave a Reply