600 మందికి ఉచిత కుట్టు శిక్షణ సర్టిఫికెట్ల పంపిణీ
302 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.కోటి విలువైన చెక్కులు
మహిళా ఇందిరా శక్తి పథకం కింద నూతన ఆయిల్ మిల్ ప్రారంభోత్సవం
మంథని, అక్టోబర్ 17, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదివారం (అక్టోబర్ 18) మంథనిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు లబ్ధిదారులకు ధ్రువపత్రాలు, ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేయనున్నారు.
మంత్రి వ్యక్తిగత సహాయకుడు ఎ. చంద్రశేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆదివారం ఉదయం 9 గంటలకు మంత్రి శ్రీధర్‌బాబు మంథనిలో పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు.
600 మందికి కుట్టు శిక్షణ సర్టిఫికెట్లు
మధ్యాహ్నం ఒంటి గంటకు మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అలీఫ్, డీఆర్డీఏ, మెప్మా, సీఎస్ఆర్ సహకారంతో మంథని మున్సిపల్ పరిధిలో ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 600 మందికి సర్టిఫికెట్లను మంత్రి అందజేయనున్నారు.
మంథని నియోజకవర్గవ్యాప్తంగా ఇప్పటివరకు 3,040 మందికి ఉచిత కుట్టు శిక్షణ అందించి, ధ్రువపత్రాలను పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
302 మందికి రూ.కోటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు
అదే కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.కోటి విలువైన ఆర్థిక సహాయ చెక్కులను 302 మంది లబ్ధిదారులకు మంత్రి శ్రీధర్‌బాబు చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు.
మహిళా ఇందిరా శక్తి ఆయిల్ మిల్ ప్రారంభం
మధ్యాహ్నం 2 గంటలకు మెప్మా ఆధ్వర్యంలో మహిళా ఇందిరా శక్తి పథకం కింద మంజూరైన నూతన ఆయిల్ మిల్‌ను మంత్రి ప్రారంభించనున్నారు. మంథని మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన ఈ ఆయిల్ మిల్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.
అనంతరం మంథనిలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకోనున్నారు.
మంత్రి పర్యటనకు సంబంధించిన కార్యక్రమ వివరాలను ఆయన వ్యక్తిగత సహాయకుడు ఎ. చంద్రశేఖర్ వెల్లడించారు.










Leave a Reply