Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › రైతుల వ్యవసాయ అవసరాలకు సహకార సంఘం ద్వారా రుణాలు
బ్రేకింగ్ న్యూస్

రైతుల వ్యవసాయ అవసరాలకు సహకార సంఘం ద్వారా రుణాలు

09:34 ఉదయం AM

రూ.31.80 లక్షల విలువైన రుణ చెక్కులు అందజేత

మంథని | అయుష్ 24 న్యూస్

రైతుల వ్యవసాయ అవసరాల కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా కర్షక మిత్ర రుణాలు మంజూరు చేసినట్లు మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ తెలిపారు.

స్థానిక సంఘ కార్యాలయంలో రుణాలు మంజూరైన రైతులకు చైర్మన్ కొత్త శ్రీనివాస్, సంఘ కార్యదర్శి బొద్దుల సమ్మయ్యతో కలిసి రూ.31.80 లక్షల విలువైన రుణ చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతులకు వ్యవసాయ పనుల కోసం ఆర్థిక సహకారం అందించడమే సహకార సంఘం ప్రధాన లక్ష్యమన్నారు. రైతులు రుణాలను సద్వినియోగం చేసుకొని వ్యవసాయంలో అభివృద్ధి సాధించాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం మరిన్ని రుణ సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

పర్షవేన సంతోష్‌కు రూ.7.80 లక్షలు, మీసాల రవి, పర్షవేన బాలరాజు, నాగుల జగన్, అనవేన రాజేశ్వరిలకు రూ.6 లక్షల చొప్పున రుణాలు మంజూరయ్యాయి.

కార్యక్రమంలో సహకార సంఘం పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, రైతులు, రుణ లబ్ధిదారులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 63🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *