లక్ష్మీ విజయ సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించిన దేవరకొండ ఎమ్మెల్యే
- ఎమ్మెల్యే బాలు నాయక్‌ను ఘనంగా సన్మానించిన డాక్టర్ ఆర్. శంకర్ నాయక్
దేవరకొండ, ఆగస్టు 13:దేవరకొండ పట్టణంలోని లక్ష్మీ విజయ సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ రామావత్ శంకర్ నాయక్ ఎమ్మెల్యే బాలు నాయక్‌కు సాదర స్వాగతం పలికి, శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. దేవరకొండ ప్రాంత ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడం ద్వారా హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపారు. దేవరకొండలోనే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రి యాజమాన్యానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంఏ సిరాజ్ ఖాన్, డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, కిన్నెర హరికృష్ణ, పాపా నాయక్ తదితరులు పాల్గొన్నారు.దేవరకొండ
– అయుష్ 24 న్యూస్

