Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › తెలంగాణ › వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన
తెలంగాణ

వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన

09:17 ఉదయం AM

వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు — సంరక్షణ ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు

మంథని, అక్టోబర్ 05, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అటవీ శాఖ మంథని రేంజ్ సిబ్బంది ఆధ్వర్యంలో సోమవారం వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా అడవులు, వన్యప్రాణులు, జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యత ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. వన్యప్రాణుల సంరక్షణ అంశంపై క్విజ్ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు, కళాశాల సిబ్బందితో వన్యప్రాణుల సంరక్షణ ప్రతిజ్ఞ చేయించారు.

యువతలో పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై బాధ్యతాయుతమైన భావన పెంపొందించడమే కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో మంథని అటవీ శాఖ రేంజ్ అధికారి ఎం. వినయ్ నాయక్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పోశయ్య, డిప్యూటీ రేంజ్ అధికారి పి. దేవదాస్, సెక్షన్ అధికారులు మంగీలాల్, రవి, షా ఖాన్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 9🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App