అడవులు, అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి: మంథని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం.వి. నాయక్
మంథని, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మంథని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం.వి. నాయక్ అన్నారు. పెద్దపల్లి డీఎఫ్ఓ ఆదేశాల మేరకు శుక్రవారం ఎఫ్ఆర్ఓ ఎం.వి. నాయక్ ఆధ్వర్యంలో ఖాన్సాయిపేట, భట్ పల్లి గ్రామాల్లో కార్డన్ సెర్చ్, రైడ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులకు వన్యప్రాణి వారోత్సవాలపై అవగాహన కల్పించారు. అడవులను నరకడం, వన్యప్రాణులను వేటాడడం చట్టరీత్యా నేరమని ఎం.వి. నాయక్ తెలిపారు. అటవీ సంపదను కాపాడడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం శివ్వారం వన్యప్రాణి అభయారణ్యంలో క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఏక్లాస్ పూర్ అటవీ ప్రాంతంలోనూ గ్రామస్తులకు వన్యప్రాణులు, అటవీ సంరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమాల్లో పెద్దపల్లి ఎఫ్ఆర్ఓ టి. సతీష్ కుమార్తో పాటు మంథని, పెద్దపల్లి రేంజ్ల డిప్యూటీ రేంజ్ అధికారులు, సెక్షన్ అధికారులు, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.










Leave a Reply